భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది!
- భారతీయ సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో లాహోరి జీరా సంచలనం
- ముగ్గురు కజిన్స్ రూ.10 ధరతో ప్రారంభించిన డ్రింక్
- ఈ ఏడాది రూ.800 కోట్ల ఆదాయమే లక్ష్యంగా దూసుకెళుతున్న సంస్థ
- ఇటీవల రూ.200 కోట్ల నిధులు సమీకరించి రూ.2,800 కోట్ల విలువకు చేరిన కంపెనీ
- భారీ మార్కెటింగ్ లేకుండానే ఉత్పత్తి, పంపిణీపై దృష్టి సారించి విజయం
ఒకప్పుడు వీధి చివర దొరికే జీరా సోడా రుచి ఇప్పుడు రూ.వందల కోట్ల వ్యాపారంగా మారింది. ముగ్గురు కజిన్స్ తమ బాల్యపు జ్ఞాపకాలకు వ్యాపార రూపమిచ్చి, విదేశీ శీతల పానీయాల ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నారు. పాకిస్థాన్‌లోని నగరం పేరుతో, పక్కా భారతీయ రుచితో రూపుదిద్దుకున్న 'లాహోరి జీరా' ప్రస్థానమిది.
2017లో సౌరభ్ ముంజల్, సౌరభ్ భుట్నా, నిఖిల్ దోడా అనే ముగ్గురు కజిన్స్ ఈ సంస్థను ప్రారంభించారు. పంజాబ్ వీధుల్లో గోలీ సోడా, ఉప్పు, జీరా పొడితో కలిపి అమ్మే డ్రింక్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. మార్కెట్‌లో ఉన్న పెద్ద బ్రాండ్ల డ్రింక్స్‌లో ఈ దేశీ ఫ్లేవర్ లేకపోవడాన్ని గమనించి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కేవలం రూ.10 ధరతో 160ఎంఎల్ బాటిల్‌ను అందించి, తక్కువ సమయంలోనే వినియోగదారులను ఆకట్టుకున్నారు.
భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు ఉన్న ఉమ్మడి పంజాబ్ సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా దీనికి 'లాహోరి జీరా' అని పేరు పెట్టారు. లాహోర్ నగరం, భారత సరిహద్దుకు దగ్గరగా ఉండటం కూడా ఈ పేరుకు ఒక కారణం. సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన నిఖిల్ దోడా మాట్లాడుతూ, "మేమంతా కలిసి పెరిగాం, కలిసే ఏదైనా చేయాలని కలలు కన్నాం. భారతీయ పానీయాల మార్కెట్‌కు భారీ సామర్థ్యం ఉందని నమ్మాం" అని తెలిపారు.
ప్రారంభంలో రెండు హ్యాండ్ మెషిన్లతో ఉత్పత్తి మొదలుపెట్టి, స్థానికులతో టేస్టింగ్ సెషన్లు నిర్వహించి ఫార్ములాను ఖరారు చేశారు. భారీ మార్కెటింగ్ ప్రకటనలకు బదులుగా ఉత్పత్తి సామర్థ్యం, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ వ్యూహం అద్భుతంగా ఫలించింది. 2025లో సంస్థ ఆదాయం రూ.540 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.800 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ నుంచి రూ.200 కోట్లు సమీకరించడంతో, కంపెనీ విలువ రూ.2,800 కోట్లకు చేరింది.
ప్రస్తుతం లాహోరి జీరాతో పాటు లాహోరి శికంజి, నింబూ, కచ్చా ఆమ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా సంస్థ అందిస్తోంది. కేవలం 20 మందితో మొదలైన ఈ కంపెనీలో ఇప్పుడు 1,800 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, పక్కా ప్రణాళికతో ఎలా భారీ విజయం సాధించవచ్చో 'లాహోరి జీరా' నిరూపిస్తోంది.